2010 రికార్డును ఓవర్‌టేక్ చేసిన మెర్సిడెస్ బెంజ్

ప్రస్తుత సంవత్సరంలో లగ్జరీ కార్ మార్కెట్ 20-30 శాతం మేర పెరగవచ్చునని కంపెనీ అంచనా వేస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ వంటి ఇతర లగ్జరీ కార్ బ్రాండ్‌లతో గట్టి పోటీ ఎదుర్కుంటున్న మెర్సిడెస్ బెంజ్ చిన్న, పటిష్టమై నగరాల్లో తమ లగ్జరీ కార్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలని యోచిస్తోందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పీటర్ హానెగ్ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి 65 అవుట్‌లెట్లను కలిగి ఉండాలని భావిస్తోంది.
రానున్న సంవత్సరంలో అదనంగా మరో 10-15 అవుట్‌లెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఈ సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 7,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








