కాంపాక్ట్ కార్లను విడుదల చేయనున్న మెర్సిడెస్ బెంజ్

Benz Small Car
ధనికులు మాత్రమే కొనగలిగిన విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ కార్లను త్వరలో మధ్య తరగతి ప్రజలు కూడా సొంతం చేసుకోగలరు. లగ్జరీ కార్ల అమ్మకాలలో దాదాపు దశాబ్ధ కాలం పాటు భారత లగ్జరీ కార్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇకపై చౌక రకం కార్లను కూడా ఇక్కడి వినియోగదారుల కోసం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 2012 చివరి నాటికి భారత మార్కెట్లో కాంపాక్ట్ రేంజ్ కార్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఈ ఏడాది యూరప్ మార్కెట్ కోసం లెఫ్ట్-హ్యాండ్-డ్రైవ్ ఆప్షన్ కలిగిన కార్లను విడుదల చేయనున్నామని అలాగే, భారత్‌లో 2012 చివరి నాటికి చిన్న కార్లను ప్రవేశపెట్టనున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పీటర్ హానెగ్ తెలిపారు. ఈ కార్లను సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) యూనిట్లుగా దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు 40-50 శాతం విడి భాగాలను భారత్‌ నుంచే కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫలితంగా మెర్సిడెస్ బెంజ్ కార్ల ఉత్పత్తి వ్యయం తగ్గడమే కాకుండా తక్కువ ధరకే ఈ కార్లు లభించే అవకాశం ఉంది.

ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్‌కు పూణేలోని ఛాకన్‌లో ఓ ఉత్పత్తి కేంద్రం ఉంది. అయితే, ఇందులో సి, ఎస్, మరియు ఈ క్లాస్ వంటి లగ్జరీ కార్లను మాత్రమే అసెంబ్లింగ్ చేస్తుంది. కానీ, కాంపాక్ట్ కార్లను ఉత్పత్తి చేయడానికి ఈ ప్లాంటులో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇకపోతే కంపెనీ అమ్మకాల గురించి పీటర్ హానెగ్ మాట్లాడుతూ.. గతేడాది కంపెనీ 5,800 యూనిట్లను విక్రయించిందని, ఈ ఏడాది అమ్మకాలు 7,000 యూనిట్లను అధిగమించవచ్చునని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భారత మార్కెట్లో బెంజ్ కార్ల ప్రారంభ ధరలు సుమారు రూ. 26 లక్షల నుండి రూ. 2 కోట్లకు పైబడి ఉన్నాయి. భారత్‌లో ఏ-క్లాస్ మరియు బి-క్లాస్ కాంపాక్ట్ కార్ల విడుదలతో బెంజ్ కార్లను సొంతం చేసుకోవాలనుకునే వారి కల నిజం కానుందన్నమాట.

More from DriveSpark

Article Published On: Wednesday, July 20, 2011, 18:24 [IST]
English summary
Mercedes-Benz, the German Luxury carmaker has announced plans to unveil its compact range of car in India by 2012. The left hand drive version of the Mercedes-Benz compact car will be launched in the US and Europe later this year and the right hand drive version will be made available next year, according to Mercedes Benz India MD and CEO Peter Honegg.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+