హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ కార్లను విడుదల చేయనున్న బెంజ్

Benz F Cell Car
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్, రానున్న మూడేళ్లలో హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌తో నడిచే కార్లను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం కంపెనీ ఇంజనీర్లు ఈ రకం ప్రోటోటైప్ కార్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే.. హైడ్రోజన్ ఫ్యూయెల్‌తో నడిచే కార్లు చాలా పర్యావరణ సాన్నిహిత్యమైనవి. కానీ, హైడ్రోజన్ ఫ్యూయెల్‌ పేలుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది, దీనివల్ల కలిగే చిన్న ప్రభావం కూడా కారుకు ప్రమాదంగా మారే ఆస్కారం ఉంది. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు కార్ల తయారీ సంస్థలు ఈ టెక్నాలజీపై కార్లను క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

హైడ్రోజన్ ఫ్యూయెల్‌తో నడిచే కార్లకు మరొక సవాల్ ఏంటంటే.. హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ల లభ్యత. హైడ్రోజన్‌ను స్టోర్ చేయడం కాస్తంత ప్రమాదంతో కూడుకున్నది కావడంతో హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటు కొంచెం క్లిష్టమైన అంశమనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ.. ఈ టెక్నాలజీలో చేసిన వరుస అభివృద్ధి పనులు, పటిష్టమైన, తేలిక పదార్థాలతో చేసిన హైడ్రోజన్ ఫ్యూయెల్-రన్ కార్లు సురక్షితమైనవని రుజువు చేశాయి. మెర్సిడెస్ బెంజ్ ఇటీవల బి-క్లాస్ హ్యాచ్‌బ్యాక్‌లో హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌తో నడిచే ప్రోటోటైప్ కారును రూపొందించింది. అంతేకాకుండా.. ఏ పరిస్థితుల్లోనైనా ఈ కారు సురక్షితమని తెలిపి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఈ కారును నడిపి కూడా చూపించింది.

More from DriveSpark

Article Published On: Saturday, June 25, 2011, 17:01 [IST]
English summary
Germany luxury car maker Mercedes Benz, the is all set to launch the production version of cars running on Hydrogen Fuel cells in next three years. At present, the company engineers working on a proto type of these cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+