2011 సిఎల్ఎస్ క్లాస్‌ను విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్

Mercedes Benz launches 2011 CLS Class
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ దేశీయ మార్కెట్లో మరో సరికొత్త లగ్జరీ కారును ప్రవేశపెట్టింది. రెండో తరానికి చెందిన సిఎల్ఎస్ క్లాస్ సెలూన్ కారును కంపెనీ నేడు భారత లగ్జరీ కార్ మార్కెట్లోకి విడుదల చేసింది. పాత మోడల్ సిఎల్ఎస్ క్లాస్ డిఎన్‌ఏ మిస్ కాకుండా, అత్యంత ఆకర్షనీయమైన డిజైన్ కలిగిన ఈ ఫోర్ డోర్ కూపే వెర్షన్‌ను మెర్సిడెస్ బెంజ్ ముంబైలో ఆవిష్కరించింది.

2011 సిఎల్ఎస్ కారులో 7జి-ట్రానిక్ గేర్‌బాక్స్ (ఆటోమేటిక్ గేర్స్), పూర్తి ఎల్‌ఈడి ల్యాంప్స్, హార్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్‌ను అమర్చారు. ఇందులో బిగించిన 3498 సీసీ వీ6 పెట్రోల్ ఇంజన్ 6500 ఆర్‌పిఎమ్ వద్ద 306 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ కార్లరో ఎల్‌ఈడి లైట్లతో వస్తున్న తొలి కారు 2011 సిఎల్ఎస్ కావడం విశేషం. ఇంకా ఇందులో వాయిస్ ఆధారంగా పనిచేసే వ్యవస్థ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు కూడా ఉన్నాయి.

ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. సిఎల్ఎస్ 350 సిడిఐ డీజిల్ ఇంజన్ 224 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని 540 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే సిఎల్ఎస్ 63 ఏఎమ్‌జి 6.2 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజన్ 500 హెచ్‌పిల గరిష్ట శక్తిని 630 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇకపోతే భారత మార్కెట్లో 2011 మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్ క్లాస్ 67.67 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)గా కంపెనీ నిర్ణయించింది.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2011, 17:37 [IST]
English summary
German luxury carmaker Mercedes Benz India launched its 2nd gen CLS Class coupe in India Today. The all-new CLS Class price at Rs. 67.67 lakhs ex-showroom Mumbai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+