మెర్సిడెస్ బెంజ్ నుంచి జీ-క్లాస్ ఎస్‌యూవీ 'జీ-55 ఏఎమ్‌జీ'
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తొలిసారిగా భారత మార్కెట్లో జీ-క్లాస్ వాహనాన్ని విడుదల చేసింది. గడచిన ముప్పై ఏళ్లుగా కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు తాజాగా "జీ-55 ఏఎమ్‌జీ" అనే స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని దేశీయ వినియోగదారులకు పరిచయం చేసింది. ఇప్పటికే ఈ కారుకు భారత్ నుంచి 20 బుకింగ్‌లు వచ్చాయని, ఈ నెలాఖరు నాటికి తొలి వాహనాన్ని డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది.
ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 2,00,000 జీక్లాస్ వాహనాలను విక్రయించామని, వినియోగదారుల నుంచి ఈ కారుకు ఎంతగానో ఆదరణం లభించిందని, ఎస్‌యీవీ విభాగంలో లగ్జరీ సదుపాయాలు కోరుకునే వినియోగదారులకు ఇది చక్కగా సరిపోతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) దెబాశిస్ మిత్రా తెలిపారు. భారత మార్కెట్లో దీని ధర రూ. 1.10 కోట్లు (ఎక్స్-షోరూమ్ ముంబై)గా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications









