మెర్సిడెస్ బెంజ్ నుంచి ఎస్ఎల్‌కె 350 రోడ్‌స్టర్

Mercedes Benz SLK 350
భారత్‌లో లగ్జరీ కార్లకు పెట్టింది పేరయిన మెర్సిడెస్ బెంజ్ మరో కొత్త కారును దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. 'మెర్సిడిస్‌ బెంజ్‌ ఎస్‌ఎల్‌కె 350' అనే సరికొత్త స్పోర్టీ రోడ్‌స్టర్ లగ్జరీ కారును ఈ జర్మన్ కంపెనీ ఢిల్లీలో విడుదల చేసింది. మూడో తరానికి చెందిన ఎస్ఎల్‌కె 350 తొమ్మిది ఆకర్షణీయమైన రంగులో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్‌లో లభించే ఈ కారు లీటరు పెట్రోల్‌కు 8 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

ఎస్ఎల్‌కె 350 మోడల్ పూర్తిగా విదేశాల్లోనే తయారై భారత్‌ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియు)గా దిగమతి చేసుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 57 మెర్సిడెస్ బెంజ్ టచ్-పాయింట్ల ద్వారా ఇది విక్రయించబడుతుంది. గతేడాదిలో మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌కె 200 మోడల్ కార్లను ప్రతినెలా 3-4 కార్లు చొప్పున విక్రయించే వాళ్లమని, ఈ కొత్త మోడల్ విడుదల ద్వారా అమ్మకాలు పెరగగలవని ఆశిస్తున్నామని సంస్థ డైరెక్టర్ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) దేబాషిష్‌ మిత్రా తెలిపారు.

భారత మార్కెట్లో ఎస్‌ఎల్‌కె 350 మోడల్ ధర రూ. 61.9 లక్షలుగా ఉంది. ఇది కేవలం 5.6 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 11, 2011, 10:51 [IST]
English summary
German luxury car maker Mercedes-Benz launched its all new sporty offering, roadster SLK350 in India on Wednesday. SLK350 priced at Rs. 61.9 lakh (ex-showroom New Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+