భారత్‌లోకి మరో రెండు మోడళ్లను ప్రవేశపెట్టిన మెర్సిడెస్ బెంజ్

ఎస్ఎల్ 350, జిఎల్ 500 రెండు మోడళ్లు కూడా తాము అందిస్తున్న ఉత్పత్తుల్లో అత్యం ప్రాయచుర్యం కలిగినవని, ఈ రెండు వాహనాలు కూడా ఆటో ఉత్సాహకులు, విమర్శకులు, వినియోగదారులు మరియు మీడియాల నుంచి ఖచ్చితంగా ప్రశంసలు అందుకుంటాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ హానెగ్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీలలో జిఎల్ 500 కూడా ఒకటని, ఇలాంటి వాహనలపై మోజు కలిగిన భారతీయలు అభిరుచికి తగినట్లుగా ఇది ఉంటుందని ఆయన తెలిపారు.
కాగా.. 3.5 లీటర్ వీ6 ఇంజన్‌తో లభ్యమయ్యే ఎస్ఎల్ 350 స్పోర్ట్స్ కారు 296 బిహెచ్‌పిల శక్తిని, 360 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తూ.. గంటకు దాదాపు 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం ఆరు సెకండ్లలో ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇకపోతే.. 5.5 లీటర్ వీ8 ఇంజన్‌తో జిఎల్ 500 ఎస్‌యూవీ 388 బిహెచ్‌పిల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఆడి క్యూ5, టొయోటా ల్యాండ్‌క్రూజర్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








