త్వరలో రోడ్లపైకి రానున్న'బెంజ్ బస్'..!!

ప్రస్తుతం ఈ లగ్జరీ బస్సును నావీ ముంబయి మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ (ఎన్ఎమ్ఎమ్‌టి) ట్రయల్ రన్ చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ మరియు ట్రాన్స్‌పోర్ట్ అధికారులు సంయుక్తంగా ఈ ట్రయల్ రన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ బెంజ్ లగ్జరీ బస్సు సిబిడి నుంచి బాంద్రా రైల్వేస్టేషన్ (పశ్చిమం) వరకూ నడపబడుతుంది. తర్వాత ఈ దూరాన్ని బోరివాలి రైల్వేస్టేషన్ వరకూ పొడిగించడం జరుగుతుంది. ఒక్క నెలపాటు ఈ ట్రయల్ రన్ నిర్వహించడం జరుగుతుంది.
ప్రజలు ఇకపై రక్షణతో కూడిన ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని పొందవచ్చని ఎన్ఎమ్ఎమ్‌టి అధికారుల పేర్కొన్నారు. లగ్జరీ బస్సలకు ప్రపంచ లీడర్‌గా వ్యవహరిస్తున్న మెర్సిడెస్ బెంజ్ భారత రోడ్లపై కూడా తన హవాను నిరూపించుకోగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పూణే, బెంగుళూరు నగరాలలో కూడా ఈ బస్సులను ట్రయల్ నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications








