రాష్ట్రంలో అత్యాధునిక షోరూమ్‌ను ప్రారంభించి మెర్సిడెస్

గడచిన 125 సంవత్సరాలుగా అత్యుత్తమ వాహనాలను, సేవలను వినియోగదారులకు అందించేయడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని, ఈ షోరూమ్ ఏర్పాటుతో భారత్‌లో ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ షోరూమ్‌ల సంఖ్య 28 నగరాల్లో 57 టచ్ పాయింట్ కేంద్రాలకు పెరిగిందని ఆయన తెలిపారు. 2010 డిసెంబరు నాటికి భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ మొత్తం 30,000 వాహనాలను విక్రయించింది. ఈ సంస్థకు భారత్‌లో 38 శాతం మార్కెట్ వాటా ఉంది. 2010లో భారత్‌లో 80 శాతం వృద్ధిని సాధించి, 6,000 కార్లు విక్రయించామని హోనెగ్ తెలిపారు. పూనేలోని చాకన్ ప్లాంటులో రెండవ షిప్ట్‌ను ప్రారంభించామని, దీంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం సాలీన 10,000 యూనిట్లకు చేరిందని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications








