మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ డైమ్లర్ ఏజి భారత్‌లో ఆర్థిక సేవల (ఫైనాన్షియల్ సర్వీసెస్) విభాగంలోకి ప్రవేశించింది. మెర్సిడెస్ బెంజ్ కార్లు మరియు డైమ్లర్ వాహనాలకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందించేందుకు 'డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్' పేరుతో ఓ పూర్తి అనుబంధ సంస్థను కంపెనీ ఏర్పాటు చేసింది. "ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు బెంజ్ కార్లలో రెండు మరియు డైమ్లర్ గ్రూప్ యొక్క ప్రతి నాలుగో వాణిజ్య వాహనం డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా ఫైనాన్స్ చేయబడుతున్నాయి. ఇతర దేశాల్లో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని భారత్‌లో కూడా చేయాలనుకున్నామ"ని డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజి మేనేజ్‌మెంట్ బోర్డ్ చైర్మన్ క్లాస్ ఎన్టన్‌మ్యాన్న్ తెలిపారు.
ప్రస్తుతం డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 40 దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. భారత్‌లోని మెర్సిడెస్ బెంజ్ కార్ల కొనుగోలుదారులకు మరియు డీలర్లకు డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఫైనాన్స్, లీజింగ్ మరియు ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అందించనుంది. అలాగే, డైమ్లర్ ఇండియా అందిస్తున్న వాణిజ్య వాహనాలకు కూడా ఇదే విధమైన స్కీమ్‌లను అందించనుంది. 2012 నాటికి డైమ్లర్ ట్రక్ 'భారత్ బెంజ్' మార్కెట్లోకి రావచ్చని అంచనా. భారత్ బెంజ్ అమ్మకాల మద్దతు కోసం ఫైనాన్షియల్ సేవలను డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించనుంది.