భారత్‌లోనే అత్యధిక బెంజ్ కార్లను కలిగి ఉన్న కంపెనీ

హాస్పిటాలిటీ పరిశ్రమ ద్వారా వివిధ విభాగాల్లో అధిక సంఖ్యలో హై-ఎండ్ ఆర్గనైజేషన్ల కోసం లగ్జరీ కార్లను ఉపయోగించటం మంచి ట్రెండ్ అని ఈ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పీటర్ టి హానెగ్ వ్యాఖ్యానించారు. ఇలా ఎదుగుతున్న ట్రెండ్‌కు మెర్సిడెస్ బెంజ్ ఇండియాతో కార్జ్ఆన్‌రెంట్ సంబంధం ఓ సాక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందని, కార్పోరేట్ కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే ఓ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశామని హానెగ్ చెప్పారు. అయితే, ఈ డీల్ ఎంత విలువ చేస్తుందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
కార్జ్ఆన్‌రెంట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ విజ్ మాట్లాడుతూ.. విలాసవంతమైన పర్సనల్ మొబిలిటీ సొల్యూషన్‌లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని అన్నాకు. హై-ప్రొఫైల్ పర్యాటకుల కోసం తాము వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థలతోనూ, హోటళ్లు, ఆర్థిక సేవల కంపెనీలతోనూ భాగస్వామ్యాలు కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








