భారత్‌లో డ్రైవింగ్ అకాడెమీను ఏర్పాటు: మెర్సిడెస్ బెంజ్

"మా సుధీర్ఘ కల త్వరలో ఫలవంతం కాబోతుంది. ఇది (అకాడెమీ) మాకు జర్మనీ, అమెరికా, చైనాల తర్వాత నాల్గవది. ఇది వచ్చే జనవరి-మార్చిలో రానుంద"ని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ దెబాశిష్ మిత్రా తెలిపారు. ఈ అకాడెమీ వన్-డే సర్టిఫికెట్ కోర్సును అందిస్తుందని, ఈ కోర్సును ఒక నెలలో రెండు సార్లు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఈ అకాడెమీను నోయిడాలో ఏర్పాటు చేస్తామని, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు జర్మన్ డ్రైవర్లు ఇక్కడికి వస్తారని మిత్రా తెలిపారు. ప్రారంభ దశలో ఈ అకాడెమీ తమకు పెద్దగా లాభాలను చేకూర్చబోదని, అయితే భవిష్యత్తులో ఖచ్ఛితంగా లాభాలను చేకూరుస్తుందని ఆయన అన్నారు. ఈ అకాడెమీ ఏర్పాటు సంబంధించిన పెట్టుబడుల వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.


Click it and Unblock the Notifications








