టాటా బాటలో మెర్సిడెస్: నానోకు పోటీగా చిన్నకారు

ఈ జాబితాలో బెంజ్ వంటి లగ్జరీ కార్లను అందించిన మెర్సిడెస్ సంస్థ కూడా చేరిపోయింది. భారత్‌కు ఇప్పటివరకూ లగ్జరీ కార్లను మాత్రమే అందిస్తున్న మెర్సిడెస్ కూడా చిన్న కార్ల తయారీపై దృష్టిసారించింది. టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన "టాటా నానో"కు పోటీగా తాము కూడా చిన్న కారును రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.
అయితే చిన్న కారు విడుదలకు సంబంధించిన సమయాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదని ఆయన తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకే ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నామని, ఈ ప్రాజెక్టు కోసం భవిష్యత్తులో ఒక కోటి యూరోలను పెట్టుబడిగా వెచ్చించనున్నామని కంపెనీ సీఎఫ్ఓ తెలిపారు.
జర్మనీలో మెర్సిడెస్ కంపెనీ సహకారంతో బెంగుళూరులో ఉన్న ఆర్ అండ్ డి కేంద్రంలో ఈ చిన్నకారు తయారీకి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం వార్షికంగా 600 యూనిట్లు ఉన్న ఉత్పత్తిని వచ్చే ఏడాదిలో 1,200కు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటుగా ప్రస్తుతం ఉన్న డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మెర్సిడెస్ కంపెనీ భారత్‌లో 20 మోడళ్లను విక్రయిస్తుంది.


Click it and Unblock the Notifications








