టాటా బాటలో మెర్సిడెస్: నానోకు పోటీగా చిన్నకారు

Mercedes Small Car
ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారుల ట్రెండ్ చిన్నకార్లపై ఉండటంతో.. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు అగ్ర కంపెనీలు సైతం చిన్న కార్ల తయారీలో తలమునకలవుతున్నాయి. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు టాటా మోటార్స్ సంస్థ నానో కారును ప్రవేశపెట్టి మార్కెట్ గమనాన్ని మార్చివేసి చిన్న కార్ల వ్యాపారానికి తెరలేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టాటా బాటలోనే చాలా ఆటోమొబైల్ కంపెనీలు పయనిస్తున్నాయి. టాటా నానోకు పోటీగా చిన్న కార్లను రూపొందించాలని పోటీపడుతున్నాయి.

ఈ జాబితాలో బెంజ్ వంటి లగ్జరీ కార్లను అందించిన మెర్సిడెస్ సంస్థ కూడా చేరిపోయింది. భారత్‌కు ఇప్పటివరకూ లగ్జరీ కార్లను మాత్రమే అందిస్తున్న మెర్సిడెస్ కూడా చిన్న కార్ల తయారీపై దృష్టిసారించింది. టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన "టాటా నానో"కు పోటీగా తాము కూడా చిన్న కారును రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.

అయితే చిన్న కారు విడుదలకు సంబంధించిన సమయాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదని ఆయన తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకే ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నామని, ఈ ప్రాజెక్టు కోసం భవిష్యత్తులో ఒక కోటి యూరోలను పెట్టుబడిగా వెచ్చించనున్నామని కంపెనీ సీఎఫ్ఓ తెలిపారు.

జర్మనీలో మెర్సిడెస్ కంపెనీ సహకారంతో బెంగుళూరులో ఉన్న ఆర్ అండ్ డి కేంద్రంలో ఈ చిన్నకారు తయారీకి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం వార్షికంగా 600 యూనిట్లు ఉన్న ఉత్పత్తిని వచ్చే ఏడాదిలో 1,200కు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటుగా ప్రస్తుతం ఉన్న డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మెర్సిడెస్ కంపెనీ భారత్‌లో 20 మోడళ్లను విక్రయిస్తుంది.

Most Read Articles

English summary
The Indian presence for Mercedes Benz is gaining momentum with its sale volume increasing and time is now for it to think of capitalizing the trend setters. This has resulted with the company involving in designing a small car akin to Tata Nano, said an official of the company. He however said there is no time frame this product launch.
Story first published: Monday, February 21, 2011, 16:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X