అత్యంత విలాసవంతమైన హెలికాప్టర్‌ను రూపొందించిన బెంజ్

అత్యంత విలాసవంతమైన ఈసీ 145 హెలికాప్టర్‌లోని సీట్లు ఎంతో సౌకర్యవంతంగా, ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా మార్చుకునే వీలుతో ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ లోపలి ఫ్లోరింగ్‌ను పై సీలింగ్‌ను నాజూకైన చెక్కతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇటలీలోని కోమోలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ అడ్వాన్స్‌డ్ డిజైన్ స్టూడియో చేపట్టింది. ఈ స్థాయిలో ఎనిమిది మంది కూర్చుని ప్రయాణించగలిగే ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం విశేషం.
మెర్సిడెస్ బెంజ్ సరికొత్త క్రాసోవర్ కారు "ఆర్-క్లాస్" ద్వారా ప్రేరణ పొంది ఈ హెలికాప్టర్ క్యాబిన్ లేఅవుట్‌ను డిజైన్ చేశారు. ఇందులో ఉండే సీట్లను చిటికెలో సునాయాసంగా మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు, అవసరం లేదనుకుంటే పూర్తిగా తొలగించుకొని లగేజ్ రూమ్ మార్చేసుకోవచ్చు. గల్ఫ్ కిట్ బ్యాగులు, బైస్కిల్స్ (వీటిని కూడా మెర్సిడెస్ బెంజే ప్రత్యేకంగా తయారు చేసింది)ను కూడా ఇముడ్చుకోవచ్చు. ఇంకా ఇందులో కూలర్, కప్ హోల్డర్, టేబుల్, 15-ఇంచ్ మోనిటర్, డివిడి ప్లేయర్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇందులో ప్రయాణిస్తుంటే.. భూమికి ఆకాశానికి మధ్యలో మరో లోకం అంటూ ఉంటే, అది ఇదేనేమో అనిపిస్తుందన్నమాట.


Click it and Unblock the Notifications








