రెండు-మూడేళ్లలో భారత్‌కు రానున్న బ్రిటన్ 'మినీ' కార్లు

BMW Mini
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ చిన్న కారు బ్రాండ్ "మినీ" మరో రెండేళ్లలో భారత్‌కు రానుంది. బిఎమ్‌డబ్ల్యూకు చెందిన మినీ బ్రాండ్ తన చిన్న కార్లను తొలుత కాస్తంత ఆలస్యంగానే భారత మార్కెట్లో విడుదల చేయాలని భావించింది.

అయితే, దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ శరవేగంగా ఎదుగుతుంటంతో ఇక్కడి అవకాశాలను అందుకునేందుకు గానూ ముందుగా అనుకున్న దానికంటే త్వరగానే తన ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు పరిచయం చేయాలని తహతహలాడుతోంది.

బిఎమ్‌డబ్ల్యూ అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ మాట్లాడుతూ.. "భారత్‌లో మినీ ఉత్పత్తులను విడుదల చేయడానికి నిర్ణయించాం. ఇది సానుకూల నిర్ణయం, మరో 2-3 ఏళ్లలో ఈ బ్రాండ్ భారత్‌లో ఉంటుంద"ని అన్నారు.

అయితే, భారత మార్కెట్లో వీటి ధరలు మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశాలు ఏ కోశాన కనబడటం లేదు. అసలే బ్రిటీష్ కార్లు, అందునా బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్, ఇక ఈ కార్ల ధరలు ఏ రేంజ్‌లో ఉంటాయో మనమే అర్థం చేసుకోవచ్చు.

ఈ విషయంపై స్కాఫ్ స్పందిస్తూ.. ఇవి ప్రీమియం చిన్న కార్లని, కొంచెం అధిక ధర కలిగి ఉంటాయని అన్నారు. ఆటో విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ మినీ కారు డిజైన్ చూడటానికి ఇంచుమించు మన మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లా ఉంటుందని, డ్రైవింగ్, పెర్ఫామెన్స్ కూడా అలానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, August 27, 2011, 11:17 [IST]
English summary
Mini, the iconic British small car brand, now owned by BMW, will soon enter the Indian car market. Mini had earlier decided to delay the launch of its models in India but is now considering an earlier launch. BMW president Andreas Schaaf has said: “ We will decide on the launch of Mini in India in a year’s time. If it is a positive decision, the brand will be in India in 2-3 years.”
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+