జనవరిలో 'మినీ' కార్లను విడుదల చేస్తాం: బిఎమ్‌డబ్ల్యూ

మరో రెండు నెలల్లో మినీ కార్లను దిగుమతి చేసుకోనున్నామని, మినీ కార్ల కోసం ప్రత్యేకంగా ఢిల్లీ, ముంబైలలో రెండు షోరూమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నామని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా హెడ్ ఆండ్రియాస్ స్కాఫ్ తెలిపారు. మినీ బ్రాండ్‌లో వస్తున్న అన్ని మోడళ్లు.. కూపర్ మొదలుకొని, కంట్రీమ్యాన్, క్లబ్‌మ్యాన్ మరియు కాబ్రియో వరకూ భారత మార్కెట్లో లభ్యం కానున్నాయి.
భారత్‌లో మినీ కూపర్ ధర సుమారు రూ.25 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా. మినీ కార్లు భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ బీటెల్, ఫియట్ 500 వంటి ప్రీమియం చిన్న కార్ల సరసన చేరనుంది. మినీ బ్రాండ్‌లో టాప్-ఎండ్ వేరియంట్ అయిన క్లబ్‌మ్యాన్ ధర రూ.330 లక్షలుగా ఉండొచ్చని అంచనా. భారత్‌లో మినీ బ్రాండ్ కార్లకు మంచి ఆదరణ లభించగలదని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








