రాష్ట్ర రాజధానిలో మరో కొత్త బజాజ్ షోరూమ్ వెలసింది. నానాటికీ పెరుగుతున్న వినియోగదారుల డిమాండును తీర్చేందుకు ఆటోమొబైల్ కంపెనీలు విస్తరణ ప్రణాళికలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధి వినాయక బజాజ్ అటో డీలర్స్ ఆధ్వర్యంలో బేగంపేట ప్రాంతంలోని పాటిగడ్డ వద్ద కొత్తగా బజాజ్ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బజాజ్ ఆటో ఇటీవలే విడుదల చేసిన 125 సీసీ డిస్కవర్ వేరియంట్ మోటార్‌సైకిల్‌ను కూడా గీతారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిద్ధి వినాయక బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి. బాబుల్ రెడ్డి మాట్లాడుతూ.. బజాజ్ షోరూమ్‌తో పాటుగా వినియోగదారులకు సర్వీసింగ్ సేవలందించేదుకు ఓ వర్క్‌షాపును కూడా ఏర్పాటు చేశామని, ప్రస్తుతం జంటనగరాల్లో పది లక్షల మందికి పైగా వినియోగదారులు సంతృప్తికరంగా బజాజ్ వాహనాలను వాడుతున్నారని, కొత్తగా ఏర్పాటు చేసిన షోరూమ్‌తో సహా పది సబ్ డీలర్ల నెట్‌వర్క్ కలిగి ఉన్నామమని చెప్పారు.