మిత్సుబిషి మోంటెరో: పవర్ ప్లస్ లగ్జరీ ఎస్‌యూవీ

Mitsubishi Montero
పవర్, లగ్జరీతో కూడిన ఎస్‌‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) కోరుకునే వారికి చక్కగా సరిపోయే వాహనం 'మిత్సుబిషి మోంటెరో'. జపాన్ ఆటో దిగ్గజం మిత్సుబిషి దేశీయ మార్కెట్లో అందిస్తున్న ఎస్‌యూవీ ఇది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని సదుపాయాలతో విలాసవంతమైన డ్రైవింగ్ అనుభూతిని కల్పించేలా మోంటెరో ఎస్‌యూవీని రూపొందించారు.

మోంటెరో ఎస్‌యూవీలో ఏడుగురు ప్రయాణీకులు (డ్రైవర్‌తో కలిపి) హాయిగా ప్రయాణించవచ్చు. తరచూ దూర ప్రయాణాలు చేసేవారు ఈ ఎస్‌యూవీని ఎంచుకోవచ్చు. ఇది అత్యంత శక్తివంతమైన 3200 సీసీ, డిఓహెచ్‌సి 16-వాల్వ్, 4-సిలిండర్, ఇంటర్‌కూల్డ్ టర్బోచార్జర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 202 హార్స్‌పవర్‌ల శక్తిని, 441 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మిత్సుబిషి మోంటెరోలో స్పోర్ట్స్ మోడ్‌తో కూడిన 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ ఉంటుంది. ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఎబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది సూపర్ సెలక్ట్ 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. అంతేకాకుండా.. 12 స్పీకర్లతో కూడిన 5.1 ఛానెల్ థియేటర్ సరౌండ్ సౌండ్ రాక్‌ఫోర్డ్ ఫోస్‌గేట్ ఆడియో సిస్టమ్‌తో లభిస్తుంది.

అల్లాయ్ వీల్స్ (17")తో లభించే మిత్సుబిషి మోంటెరో ఎస్‌యూవీ గంటకు గరిష్టంగా 174 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రాష్ట మార్కెట్లో దీని ధర రూ.41,22,000 (ఎక్స్-షోరూమ్, విజయవాడ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, October 3, 2011, 15:35 [IST]
English summary
Japanese carmaker Mitsubishi offering a powerfull SUV (sports utility vehicle) Montero in Indian market. A class apart, Montero makes your every drive, a graceful event. The rugged car that is ready for anything thrown at it, transforms itself into a lap of luxury the moment you step into it. Apart from its aweinspiring design and the majestic looks, it pampers you and gives you that kingly treatment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+