భారత్‌లో మరిన్ని డీలర్‌షిప్ కేంద్రాల ఏర్పాటు: వోక్స్‌వ్యాగన్

Volkswagen Porsche
జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారత్‌లో తమ డీలర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. దేశంలో వోక్స్‌వ్యాగన్ మోడళ్లకు వస్తున్న డిమాండును అందుకోవాలంటే అందుకు తగిన సరఫరా ఉండాలని, ఇందుకోసం వోక్స్‌వ్యాగన్ భారత్‌లో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని కొత్త మోడళ్లను కూడా విడుదల చేయనుందని కంపెనీ ఉన్నాతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వోక్స్‌వ్యాగన్ ఉత్పత్తులకు వస్తున్న స్పందన తమను కంపెనీ విస్తరణ, పెట్టబడుల గురించి ఆలోచించేలా చేస్తుందని ఆయన చెప్పారు.

వోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లోకి ఆలస్యంగానే ప్రవేశించినప్పటికీ.. కంపెనీ అందిస్తున్న నాణ్యమైన ఉత్పత్తుల కారణంగా దేశీయ మార్కెట్లో ఉన్న గట్టి పోటీని సైతం తట్టుకొని ముందుకు దూసుకుపోతుంది. వోక్స్‌వ్యాగన్ పోలో ఫ్లాట్‌ఫామ్‌పై విడుదల చేసిన వెంటో సెడాన్ కారణంగా తమకు మంచి గుర్తింపు లభించిందని, ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత మార్కెట్‌కు అనుగుణంగా కంపెనీ ఓ చిన్నకారును ప్రవేశపెట్టనుందని, స్థానిక అవసరాలకు సరిపోయే విధంగా ఈ కాంపాక్ట్ కారు ఉంటుందని ఆయన వివరించారు. ప్రస్తుతం పూనే నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వోక్స్‌వ్యాగన్ భారత్‌లో ఆడి, స్కొడా వంటి బ్రాండ్‌లను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, March 14, 2011, 16:57 [IST]
English summary
The German car maker Volkswagen is likely to expand its dealer network in the Indian market to reach the unreached. This will add to the company’s strategy to launch new products and domestic manufacturing, said the company’s Member of Supervisory Board of Management at the Geneva Motor show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+