న్యూఢిల్లీకి వెళ్లనున్న ఫోర్డ్ ఇండియా ప్రధాన కార్యాలయం

ఈ ప్లాంటు ద్వారా గుజరాత్‌లో దాదాపు 5,000 మందికి ఉపాధి లభించనుంది. అమెరికాకు చెందిన ఫోర్డ్ గడచిన రెండేళ్లలో తన భారత మార్కెట్ వాటాను మూడింతలకు పెంచుకుంది. 2009లో 1 శాతంగా ఉన్న కంపెనీ మార్కెట్ వాటా ఇప్పడు దాదాపు 3 శాతానికి పెరిగింది. కాగా.. ఈ దశాబ్ధపు మధ్య కాలం నాటికి ఎనిమిది కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నామని, భారత్‌లో చిన్న కార్ల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నందు వల్ల ఈ మోడళ్లలో ఎక్కువగా ఫిగో రేంజ్ కార్లే ఉంటాయని ఆయన తెలిపారు. భారత్‌లో 70 శాతం కార్ల అమ్మకాలు చిన్న కార్ల సెగ్మెంట్ నుంచే వస్తున్నాయని హెన్రిచ్స్ చెప్పారు.


Click it and Unblock the Notifications








