జేఎల్ఆర్ నుండి మరిన్ని మేడ్ ఇన్ ఇండియా కార్లు

ప్రస్తుతం జేఎల్ఆర్‌కు చెందిన ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ ఎస్‌యూవీని టాటా మోటార్స్ భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తుంది. మరిన్ని ఇతర ల్యాండ్ రోవర్ ఉత్పత్తులతో జాగ్వార్ బ్రాండ్ మోడళ్లను కూడా భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తున్నామని జాగ్వార్ లాండ్ రోడర్ (జేఎల్‌ఆర్) ఇండియా హెడ్ (ప్రీమియర్ కారు డివిజన్) హెడ్ రోహిత్ సూరి తెలిపారు.
గడచిన మే నెలలో భారత్‌లో జేఎల్ఆర్ తమ తొలి అసెంబ్లింగ్ ప్లాంటును పూణేలో ప్రారంభించింది. ఈ ప్లాంటులో కంపెనీ అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ల్యాండ్ రోవర్ 'ఫ్రీల్యాండర్ 2'ను సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) యూనిట్లుగా బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో ఉన్న హాలేవుడ్ ఉత్పత్తి కేంద్రం నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








