ఫోర్డ్ నుంచి మరిన్ని చిన్నకార్లు, మెక్సికోకు ఫిగో ఎగుమతి

Ford Figo
భారత ఆటోమొబైల్ మార్కెట్ చిన్నకార్ల గబ్‌గా మారిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో చిన్నకార్లకు భారీ డిమాండ్ ఉంది. దీంతో ప్రీమియం కార్లను తయారుచేసే కంపెనీలు సైతం కాంపాక్ట్ కార్లపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి డిమాండ్‌ను మార్కెట్ చేసుకునేందుకు అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీ అనుబంధ సంస్థ ఫోర్డ్ ఇండియా 2015 నాటికి మరిన్ని కాంపాక్ట్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. చిన్నకార్ల విభాగంలో భారత మార్కెట్లో ఫోర్డ్ కనబరచిన వృద్ధి మరెక్కడా తాము చూడలేదని, ఫిగో కారు వల్లనే ఈ వృద్ధిని సాధించగలిగామని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హామ్ తెలిపారు.

భారత మార్కెట్లోని మొత్తం కార్ల విక్రయాలలో కాంపాక్ట్ కారు సెగ్మెంట్లోనే అధికంగా 70 శాతం విక్రయాలు జరుగుతున్నాయని, అందువల్లనే ఇక్కడ తమ ఉనికిని పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నామని, ఆయన తెలిపారు. గతేడాది మార్చి నెలలో విడుదలైన బుజ్జి కారు ఫిగో ఇప్పటి వరకూ దాదాపు 80,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. రానున్న నాలుగేళ్లలో భారత మార్కెట్ కోసం ఫోర్డ్ ఎనిమిది కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వీటిల్లో మొదటిగా ఫియస్టా సెడాన్‌లో అప్‌గ్రేడ్ వెర్షన్ ఈ ఏడాది భారత రోడ్లపై పరుగులు తీయనుందని బోన్‌హామ్ చెప్పారు.

చెన్నయ్ ప్లాంటులో ఉత్పత్తి అవుతున్న ఫిగో కారును ప్రపంచంలో మరెక్కడా ఉత్పత్తిని కానీ.. అసెంబ్లింగ్‌ని కానీ చేయబోమని బాన్‌హామ్ తెలిపారు. ఫిగో ఎగుమతలపై దృష్టి సారించాని, ప్రస్తుతం ఫోర్డ్‌ ఫిగోను దక్షిణ ఆఫ్రికా, నేపాల్‌లకు ఎగుమతి చేశామని, అంతేకాకుండా తొలిసారిగా భారత్‌ నుంచి మెక్సికోకు ఫిగో కార్లను ఎగుమతి చేయనున్నామని ఆయన తెలిపారు. మెక్సికోతో పాటు ఉత్తర ఆఫ్రికా, కరేబియన్‌, పశ్చిమ ఆసియా దేశాలకు కూడా పూర్తిగా ఫిగోను ఫోర్డ్ ఎగుమతి చేయనుంది. వచ్చే రెండు వారాల్లో 1,500 ఫిగో కార్లను మెక్సికోకు ఎగుమతి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 10, 2011, 10:33 [IST]
English summary
US car maker Ford Motor Company Indian arm Ford India is planning to launch more smalls for Indian market by 2015. India compact car segment showing rapid growth. Ford brand image has grown up with its small car Figo. Now Ford focusing on Figo exports to other countries like Mexico, North Africa, Caribbean and West Asia.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+