సరికొత్త టాటా ఇండిగో సెడాన్..: లీటరుకు 25 కి.మీ. మైలేజ్

కొత్త టాటా ఇండిగో ఈ-సిఎస్ విఎక్స్‌లో సిఆర్4 కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 1396 సీసీ సామర్థ్యాన్ని కలిగి ఉండి, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 70 పిఎస్‌ల శక్తిని మరియు 1800-3000 ఆర్‌పిఎమ్ వద్ద 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఇండికాలో గేర్ రేషియో, క్లచ్-టు-స్టార్ట్‌లలో అభివృద్ధి చేయడం జరిగింది.
అత్యుత్తమ పికప్ కోసం కారు బరువును 10 కిలోల మేర తగ్గించడం జరిగింది. కొత్త ఇండిగో ఈ-సిఎస్ విఎక్స్ కారు ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యమవుతుంది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లు రెండు కూడా బిఎస్4 (భారత్ స్టేజ్ 4) కాలుష్య నిబంధనలకు లోబడి ఉంటాయి.
సిఆర్4 కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌లో ఐదు కీలక సాంకేతిక మార్పుల కారణంగా ఇది లీటరు డీజిల్‌కు 25 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆర్14 అల్లాయ్ వీల్స్, స్టెయిన్ ఫినిష్ ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్ మరియు ఇండికేటర్లు కలిగిన రియర్ వ్యూ మిర్రర్స్, బాడీ కలర్డ్ బంపర్స్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, డ్యుయెల్ టోన్ బీగీ సీటింగ్ మరియు డ్యాష్‌బోర్డ్, ప్రీమియం వుడ్-ఫినిష్ సెంటర్ కన్సోల్, క్రోమ్ రింగ్స్‌తో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రయాణీకుల సౌకర్యం కోసం రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా.. కీలెస్ ఎంట్రీ, ఎబిఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ, రియర్ వ్యూ మిర్రర్స్ కోసం ఎలక్టికల్ కంట్రోల్స్, ఏసి, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వంటి సాంకేతిక మరియు భద్రతా ఫీచర్లతో ఇది లభిస్తుంది.
సరికొత్త టాటా ఇండికా ఈ-సిఎస్ విక్స్ కారు, ప్రవేట్ ఉపయోగార్థం 18 నెలల మరియు అపరిమిత కి.మీ. వారంటీతో లభిస్తుంది. ఇక దేశీయ మార్కెట్లో ధర విషయానికి వస్తే.. సిఆర్4 డీజిల్ ఇంజన్ వేరియంట్ ధర రూ. 580,339 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ), ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ధర రూ. 497,727 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








