కార్ ఇంపోర్ట్ స్కామ్: బాలీవుడ్ తారలు, క్రికెటర్ల వద్ద దొంగిలించిన కార్లు!

ఈ విషయం తెలుకున్న దొంగ కార్ల యజమానులు తమ దొంగ కార్లను ఎక్కడ పడితే వదిలేసి తమకు సంబంధ లేదన్నట్లుగా వెళ్లిపోతున్నారు. ఇలా అక్రమంగా కొన్న కోట్ల రూపాయాల విలువ చేసే కార్లను దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డు పక్కన వదిలేసి వెళ్తున్నారు. ఇలా వదిలేసిన కార్లలో ఆస్టన్ మార్టిన్, మరో బెంట్లీ కారు కూడా ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్ ప్రచురించింది. ఇప్పటికే నలభైకు పైగా లగ్జరీ కార్లు ప్రభుత్వ అధీనంలో కుప్పలుగా పడి ఉన్నాయి.
వీటిల్లో పోర్షే పనామెరాస్, బెంట్లీ కాంటినెంటల్ సూపర్‌స్పోర్ట్, మాసేరటి వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతేనా.. జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్టన్ మార్టిన్ కార్లు ఇటీవలే భారత్‌లోకి అధికారికంగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్మగ్లర్లు ఆస్టన్ మార్టిన్ కంపెనీ కన్నా ముందే భారత్‌లో ఎన్నో కార్లను అక్రమంగా విక్రయించారు. పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ కార్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ స్కామ్ వెనుక వియత్నాం మరియు ఉత్తరకొరియాలకు చెందిన ఇద్దరు దౌత్యవేత్తల హస్తం ఉందని తెలుస్తోంది. మరో వైపు భారత్‌లో ఇలా అక్రమంగా విక్రయించిన కార్లు బాలీవుడ్ అగ్ర సినీ తారలు, ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ల వద్ద కూడా ఉన్నాయనే కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోనే 2జీ స్కామ్ మాదిరిగా ఈ కార్ ఇంపోర్ట్ స్కామ్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెలువడే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








