ఉద్యోగి-సూపర్‌వైజర్ గొడవ: ఎమ్ఆర్ఎఫ్ ఫ్యాక్టరీ లాకౌట్

MRF Tyres
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎమ్ఆర్‌ఎఫ్‌ కేరళలోని కొట్టాయం ఫ్యాక్టరీలో, సెలవు విషయంలో ఒక ఉద్యోగికి, సూపర్‌వైజర్‌కు మధ్య ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరికి ఫ్యాక్టరీ లాకౌట్‌కు దారి తీసింది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి లాకౌట్‌ అమల్లోకి వస్తుందని కంపెనీ బాంబే స్టాక్ ఎక్చేంజ్‌కు తెలియజేసింది.

ఆ ఉద్యోగి సూపర్‌వైజర్‌ అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి. సెలవుమీద వెళ్లిన ఉద్యోగి తిరిగి ఫ్యాక్టరీకి వస్తే అతడిని విధుల్లోకి అనుమతించలేదని, దాంతో సదరు ఉద్యోగి మద్దతు తెలుపుతూ ఇతర కార్మికులు విధుల బహిష్కరించడంతో లాకౌట్‌ను ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది.

కొట్టాయం ప్లాంటులో గత నాలుగు రోజలుగా పనులు నిలిచిపోయాయి. ఫలితంగా కంపెనీ సుమారు రూ. 22 కోట్ల మేర నష్టం వాటిల్లిన్నట్లు తెలుస్తుంది. ఈ ప్లాంటులో మూడు పనివేళల్లో (షిఫ్ట్‌లలో) మొత్తం 1,350 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, June 23, 2011, 11:37 [IST]
English summary
MRF, India's leading tyre manufacturer has declared a lockout at its Kottayam plant after labour unrest. MRF in its filing with the Bombay Stock Exchange has said it had declared the lockout at Kottayam after it was unable to rectify the labour unrest that started on Saturday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+