త్వరలోనే తిరుచ్చి ప్లాంటులో టైర్ల ఉత్పత్తి ప్రారంభం: ఎమ్ఆర్ఎఫ్

తిరుచ్చి ప్లాంటులో ట్రక్కులు మరియు కార్ల టైర్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన వివరించారు. టైర్ల పరిశ్రమ వృద్ధి రేటు మందగిస్తున్న సూచనలు కనబడుతున్నాయని, అలాగే కార్ల తయారీదారులు కూడా వారి ఉత్పత్తుల అమ్మకాలలో తగ్గుదలను కనబరుస్తన్నాయని నాగియా అన్నారు. అయితే దీన్ని ఖచ్చితంగా అంచనా వేయలేమని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది తగ్గవచ్చునని ఆయన అన్నారు. సంస్థపై ఇన్‌పుట్ ధరల ఒత్తడి పెరుగుతుండటంతో టైర్ల విభాగాన్ని బట్టి ధరలను 5-10 శాతం మేర పెంచే అంశంపై కసరత్తులు చేస్తున్నట్లు నాగియా తెలిపారు.


Click it and Unblock the Notifications








