ఐరాస క్లీన్ డెవలప్‌మెంట్ మిషన్‌లో చేరిన మారుతి సుజుకి

ప్రస్తుతం వాతావరణంలో అధికంగా పెరుగుతున్న కార్బన్ డైక్సైడ్ (CO2) కారణంగా మానవాళి పెను ప్రమాదంలో చిక్కుకుంటోందని, 'హరిత ప్రపంచం' సాధించే లక్ష్యంలో తాము కూడా తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం వాహన కాలుష్యాన్ని తగ్గించే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలనుంకుంటున్నామని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తాము ఉత్పత్తి చేయబోయే వాహనాల్లో కాలుష్య నివారణకు ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని జోడిస్తామని నకన్షి తెలిపారు. అలాగే అంతరించిపోతున్న శిలాజ ఇంధనాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఇంధనాలైన సౌరశక్తి, విద్యుచ్ఛక్తిలతో నడిచే వాహనాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








