విశాఖపట్నం: ప్రముఖ సినీ నటుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి మురళీ మోహన్ ఆటో మోబైల్ రంగంలోకి ప్రవేశించారు. ఆయన జయభేరీ ఆటోమోబైల్ షోరూం పేరుతో విశాఖపట్నంలో కార్ల షోరూంను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో జగపతి బాబు, కథానాయిక చార్మి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావులు వచ్చారు. దాసరి ఈ కారు షోరూం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో మురళీ మోహన్ ముందున్నారు. జయభేరీ పేరుతో ఆయన తన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అదే పేరును ఇప్పుడు కార్ల షోరూంకు పెట్టారు. కాగా మురళీ మోహన్ తన షోరూంలో ఆఫర్లు కూడా ప్రవేశ పెట్టారు.