వేలాని మైసూర్ మాహారాజు రోల్స్ రాయిస్ కారు

20వ శతాబ్దంలో మైసూరును పాలించిన "కృష్ణరాజా వడియార్-4" ఉపయోగించిన రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్ కారును లండన్‌లోని బాన్‌హామ్స్ అనే వేలం కంపెనీ వేలానికి ఉంచింది. తొలుతగా ఈ కారును 1911లో జరిగిన ఢిల్లీ దర్బారు కోసం మహారాజు ఆర్డర్‌పై చేయించుకున్నాడట.
వేలంలో ఈ కారు సుమారు మూడు లక్షల బ్రిటన్ పౌండ్ల నుంచి నాలుగు లక్షల బ్రిటన్ పౌండ్ల మధ్య ( రూ. 2.1 కోట్ల నుంచి రూ. 2.8 కోట్లు) అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ కారును వేలం వేయనున్నారు. ఇదే రోజున టిప్పు సుల్తాన్ ట్రెజరీకు చెందిన గోల్డ్ పెండెంట్‌ను కూడా బాన్‌హామ్స్ వేలం వేయనుంది.
ఈ సిల్వర్ ఘోస్ట్ కారు దాదాపు వందేళ్ల క్రితం నాటిది. 1960 వరకూ ఈ కారు రాజ కుటుంబం వద్దనే ఉండేది. అనంతరం దీనిని బ్రిటన్‌కు చెందిన విక్టర్ బార్క్లేకు విక్రయించేశారు. ఆ తర్వాత ఇది తిరిగి తిరిగి బాన్‌హామ్స్ చేతికి వచ్చింది. ఇప్పటికీ ఈ కారు చెక్కు చెదరకుండా ఉంది. అందుకే 1995లో జరిగిన పెబుల్ బీచ్ కాంకర్స్ డిఎలిగెన్స్‌లో రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్ క్లాస్‌ను గెలుచుకుంది.
కృష్ణరాజా వడియార్-4 మైసూరును 1902-1940 వరకూ పరిపాలించారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల్లో ఆయన కూడా ఒకరు. వడియార్-4 చనిపోయేనాటికి ఆయన సంపద 400 మిలియన్ డాలర్లట. అప్పటి భారత రోడ్లకు అనుగుణంగా ఈ కారును తీర్చిదిద్దారు.
1911లో ఢిల్లీ దర్బార్‌లో జరిగిన కింగ్ జార్జ్-5, క్విన్ మేరీ పట్టాభిషేకం సందర్భంగా ఢిల్లీ పరిపాలకులు చాలా కార్లను కొనుగోలు చేశారు. తమ రవాణా సౌకర్యాల కోసం మహారాజులు ఈ కార్లను కొనుగోలు చేసేవారు. ఆయుధాల కొనుగోలుకు వినియోగించాల్సిన సొమ్ముతో వడియార్-4 ఈ కారును కొనుగోలు చేశారని చెప్పుకుంటారు.


Click it and Unblock the Notifications








