నానో కారును విదేశాల్లో ఉత్పత్తి చేయనున్న టాటా మోటార్స్

కంట్రీ లొకేషన్ లేదా ఓ జియోగ్రఫికల్ లొకేషన్‌లను దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ బెస్ట్ ఆప్షన్ కోసం వెతుకుతోందని చౌకర్ చెప్పారు. అయితే అంతకుమించి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. స్థలంతో పాటు నిర్మాణ సౌకర్యాలు, సప్లయ్ చైన్ లభ్యత, మార్కెట్ల యాక్సెసబిలిటీ వంటి విషయాలను టాటా మోటార్స్ పరిగణలోకి తీసుకొంటుందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారుగా పేరుగాంచిన టాటా నానో భారత్ మార్కెట్ కోసం కేవలం గుజరాత్‌లోని సనంద్ ప్లాంటులో మాత్రమే తయారవుతోంది. కాగా.. 2009లో టాటా మోటార్స్ యూరోపియన్ వెర్షన్ నానో "నానో యూరోపా" ను అప్పటి 79వ జెనీవా మోటార్ షోలో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాదిలో నానో యూరోపా కారు యూరప్‌లో విడుదల కానుంది. యూరప్ వెర్షన్ నానో కారు ఎయిర్‌బ్యాగ్‌లు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యూరో 5 ఎమిషన్ నార్మ్స్ కంప్లయింట్‌కు అనువుగా రూపొందనుంది. అయితే నానో యూరోపా ధరను టాటా మోటార్స్ ఇంకా నిర్ణయించలేదు, కానీ బ్రిటీష్ మీడియా అంచనాల ప్రకారం.. ఇది 6,000 డాలర్ల వరకూ ఉండవచ్చునని సమాచారం. 2009లో విడుదలైన ఇండియన్ ఎడిషన్ నానో ధర దాదాపు 2,500 డాలర్లు. ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు ఇతర హై-ఎండ్ ఫీచర్లు కలిగి ఉన్నప్పటికీ ఇది లోకాస్ట్ కారేనని రతన్ టాటా గతంలో చెప్పారు.


Click it and Unblock the Notifications








