అహ్మదాబాద్‌లో కాలి బూడిదైన మరో నానో కారు

గతేడాది మార్చిలో కారును డెలివరీ తీసుకున్న తరువాత ఓ వ్యక్తి దాన్ని తీసుకువెడుతుండగా, రోడ్డుపైనే నిప్పంటుకుని తగలబడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏప్రిల్‌లో కూడా ఇదే విధమైన సంఘటన జరిగింది. ఇంజన్‌కు ఇంధనాన్ని సరఫరా చేసే పైపులో లోపం కారణంగా మరో కారు అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటనల తరువాత నానో ప్రాజెక్ట్ టీమ్, ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ టీమ్, యూరప్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం, జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ రీసెర్చ్ టీమ్ కలసి నానోను పూర్తిగా పరిశీలించి ఇది పూర్తి సురక్షితంగా ఉన్నట్లు క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా ఈ సంఘటన వెలుగు చూడటం గమనార్హం. దీంతో "నానో" అంటే "నో" అనే వారి సంఖ్య పెరిదే ఆస్కారం ఉందేమో..!? మరి దీనిపై టాటా ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








