నేపాల్‌లో కేవలం 10 రోజుల్లో 352 నానో కార్ల బుకింగ్

Tata Nano
ఇటీవలే విదేశీ మార్కెట్లలోకి ప్రవేశింటిన టాటా మోటార్స్ "ప్రజల కారు" టాటా నానో అక్కడి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుంది. తొలుత శ్రీలంక మార్కెట్ ద్వారా విదేశీ ప్రయాణం ప్రారంభించిన టాటా నానో ఆ తర్వాత మన పొరుగుదేశమైన నేపాల్ మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే, శ్రీలంక మార్కెట్ కన్నా నేపాల్ మార్కెట్లోనే నానో కారుకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఓవైపు టాటా నానో కారుపై శ్రీలంకలో నిరసలు వెల్లువెత్తుతుంటే నేపాల్‌లో మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. నేపాల్ మార్కెట్లో విడుదలైన 10 రోజులకే 352 నానో కార్లు బుకింగ్ అయ్యాయి.

అయితే, నేపాల్ వినియోగదారులు ఎక్కువగా టాటా నానో స్టాండర్డ్ వేరియంట్ కన్నా నానో ఎల్ఎక్స్ (అధనపు సౌకర్యాలతో ఎక్కువ ధర కలిగిన మోడల్) మరియు నానో సిఎక్స్ (ఎల్ఎక్స్ వేరయంట్ కన్నా ఎక్కవ ధర కలిగినది) మోడల్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు నేపాల్ టాటా నానో అధీకృత డీలర్ సిప్రాడి ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (సిటిపిఎల్) పేర్కొంది. టాటా నానో స్టాండర్డ్ వెర్షన్ పట్ల 45 శాతం మంది సానుకూలంగా ఉంటే, ఎల్ఎక్స్ మరియు సిఎక్స్ వెర్షన్‌ల పట్ల 55 శాతం మంది సానుకూలగా ఉన్నారని సిటిపిఎల్ తెలిపింది. కాగా.. 35 శాతం మంది అధిక ధర కలిగిన టాటా నానో ఎల్ఎక్స్‌ను బుక్ చేస్తే, 35 శాతం మంది అత్యధిక ధర కలిగిన నానో సిఎక్స్ మోడల్‌ను బుక్ చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

నేపాల్ మార్కెట్లో టాటా నానో ప్రారంభ ధర 7.98 లక్షల నేపాల్ రూపాయలు. మన దేశ కరెన్సీతో పోలిస్తే దీని విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు. టాటా నానో కారుకు సంబంధించి రెండు వారాల్లో 8,000 ఎంక్వైరీలు వచ్చినట్లు సిప్రాడి తెలిపింది. బుకింగ్ చేసుకున్న వారికి జులై చివరి నాటికి డెలివరీలు అందనున్నాయి. అంతేకాకుండా, ప్రతినెలా కేవలం 11,111 నేపాల్‌ రూపాయలు మాత్రమే చెల్లించి వాయిదా పద్దతిలో కూడా ఈ చిన్న కారును సొంతం చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Sunday, July 10, 2011, 15:17 [IST]
English summary
The Tata Nano which was recently launched in Nepal has emerged as a big seller with bookings for the little Indian car crossing 352 units within 10 days of its launch. There have been heavy crowds wanting to see the Tata Nano at showrooms despite the Nano's high price due to import duties. Bookings for the Nano have been consistently high.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+