ఊపందుకున్న నానో సేల్స్.. ఉత్పత్తి పెంపుకు సన్నాహాలు

ఈ ఏడాది మార్చి నెలలో టాటా మోటార్స్ 8,707 నానో కార్లను విక్రయించింది. ఇలా విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకోవడంతో నానో ఉత్పత్తిని రెండింతలు చేసే దిశగా టాటా మోటార్స్ అడుగులేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా 20,000 నానో కార్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న సనంద్ ప్లాంటులో కంపెనీ ప్రతి నెలా 15,000 నానో కార్లను ఉత్పత్తి చేస్తుంది. ద్విచక్ర వాహనాలను కొనాలనుకునే వారే ఎక్కువగా నానో కార్లను కోనుగోలు చేస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ 2010లో 5,784, జనవరి 2011లో 6,703, ఫిబ్రవరి 2011లో 8,262 నానో కార్లను టాటా మోటార్స్ విక్రయించింది.


Click it and Unblock the Notifications








