మారుతి గుజరాత్ రాకను స్వాగతించిన నరేంద్ర మోడి

"గుజరాత్‌కు రావాలన్న మారుతి సుజుకి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆసియా ఆటో హబ్‌గా గుజరాత్ వేగంగా వృద్ధి చెందుతోంది. మారుతితో ఈ వేగం మరింత పుంజుకుంటుంద"ని మోడి తన ట్విట్టర్ బ్లాగ్‌లో పేర్కొన్నారు. "ఇది కొత్త సంవత్సరం సందర్భంగా గుజరాత్‌కు మారుతి సుజుకి అందిస్తున్న బహుమతి" అని నరేంద్ర మోడి పేర్కొన్నారు.
మారుతి సుజుకి తన వెండర్లతో కలిపి రూ.18,000 కోట్లను గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంటుపై వెచ్చించనుంది. తమ ప్లాంటు కోసం 500 ఎకరాల భూమిని, అలాగే తమ వెండర్ల కోసం మరో 500 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా మారుతి సుజుకి గుజరాత్ సర్కారను కోరింది. మానేసర్ కార్మికుల ఆందోళనతో విసిగెత్తిన మారుతి తమ ప్లాంటు కోసం అన్ని విధాలైన అనువైన గుజరాత్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








