ఈ ఏడాది చివరి నాటికి నేషనల్ ఆటోమోటివ్ బోర్డు ఏర్పాటు!

National Automotive Board
భారత ఆటో రంగ అభివృద్ధిని ప్రమోట్ చేసేందుకు గానూ ఓ ప్రత్యేకమైన విభాగాన్ని (స్పెషలైజ్డ్ బాడీ) ఈ ఏడాది చివరి నాటికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు నేషనల్ ఆటోమోటివ్ బోర్డు (ఎన్ఏబి) అనే పేరును ప్రతిపాదించడం జరిగింది. ఈ బోర్డును ఏర్పాటు చేసే అంశాన్ని భారీ పరిశ్రమల శాఖ పరిశీలిస్తోంది. "ఈ సంవత్సరం డిసెంబర్‌లో ఎన్ఏబి ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

ఇది ప్రభుత్వానికి మరియు పరిశ్రమకు మధ్య వారధిలా పనిచేస్తుంది. వృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ రంగం కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మరియు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను ప్రమోట్ చేయడంలో కీలక పాత్రను పోషిస్తుంద"ని భారీ పరిశ్రమల శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇది ప్రభుత్వానికి ఒఖ థింక్-ట్యాంక్‌లా వ్యవహరించడమే కాకుండా.. ప్రత్యేకించి దేశంలో హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధికి కృషి చేస్తుంది.

ఈ బోర్డులో భారీ పరిశ్రమల శాఖ, ప్రణాళికా సంఘం సభ్యులతో పాటుగా రోడ్డు రవాణా మరియు రహదారులు, సైన్సు మరియు సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం మరియు అడవులు వంటి వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన వారు సభ్యులుగా నియమించబడనున్నారు. వీరితోపాటు శాస్త్రవేత్తలు మరియు పరిశ్రమ ప్రతినిధులు కూడా చేరనున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 16, 2011, 13:08 [IST]
English summary
To promote sustainable development of the Indian auto sector, Govt. is planning to establish a specialized body called National Automotive Board ( NAB), is expected to be set up by the end of this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+