అక్టోబర్ నెలలో 8 శాతం పెరిగిన సహజ రబ్బర్ ఉత్పత్తి

అయితే, అక్టోబర్ నెలలో సహజ రబ్బర్ వినియోగం మాత్రం 76,000 టన్నులకు పడిపోయింది. గడచిన సంవత్సరం ఇదే కాలానికి సహజ రబ్బర్ వినియోగం 81,100 టన్నులుగా ఉంది. అలాగే సహజ రబ్బర్ ఎగుమతులు 180 టన్నుల నుండి ఏకంగా 2,262 టన్నులకు పెరిగింది. ఇక దిగుమతుల విషయానికి వస్తే.. అక్టోబర్ నెలలో ఇవి 19,710 టన్నుల నుండి 6,862 టన్నులకు పడిపోయాయి.
ప్రస్తుత నెలలో కూడా వాతావరణం సహకరిస్తే ఉత్పత్తిలో పెరుగుదల నమోదు కాగలదని రబ్బర్ బోర్డ్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో కూడా ఉత్పత్తిలో మెరుగుదల ఉందని, ఎప్రిల్-అక్టోబర్ 2011 నాటికి సహజ రబ్బరు ఉత్పత్తి 5 శాతం వృద్ధిని సాధించి 4,40,700 టన్నులుగా ఉందని తెలిపింది. అక్టోబర్ చివరి కల్లా సహజ రబ్బర్ నిల్వలు 2,47,000 టన్నులగా ఉంది.


Click it and Unblock the Notifications








