హోండా జాజ్‌ ఝలక్‌తో డైలమాలో పడిన కంపెనీలు

New Honda Jazz
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హోండా జాజ్'. ఒకప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్ కారు ఇంచు మించు హోండా సిటీ సెడాన్ కారు ధరకు సమీపంలో ఉండి సామాన్యులకు దూరంగా ఉండేది. అలాగే, ధర విషయంలో ఈ రెండు మోడళ్లలో పెద్దగా తేడా లేకపోవడంతో ఎక్కవ మంది కొనుగోలుదారులు సిటీ సెడాన్‌ను ఎంచుకునేవారు.

దీంతో దేశీయ మార్కెట్లో హోండా జాజ్ ప్రాబల్యం అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. వీటన్నింటినీ పరిశీలించిన కంపెనీ, ఒక్కసారిగా హోండా జాజ్‌ (పాత వెర్షన్)పై రూ. 1.75 లక్షల వరకూ డిస్కౌంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా.. ఈ మోడల్‌లోనే మరో కొత్త వేరియంట్‌ను అత్యంత పోటీ ధరతో కేవలం రూ. 5.5 లక్షలకే ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది.

హోండా అందిస్తోన్న ఈ బంపర్ ఆఫర్‌తో ఇదే విభాగంలో ఉన్న హ్యుందాయ్‌ ఐ20, ఫోక్స్‌‌వ్యాగన్‌ పోలో, మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్‌, టొయోటా లివా, ఫోర్డ్‌ ఫిగో తయారీదారులు సమాలోచనలో పడ్డట్లయింది. అసలే మార్కెట్ మందగమనం కారణంగా తగ్గిన అమ్మకాలను ఎలా పెంచుకోవాలా అని కంపెనీలు తలపట్టుకుంటే.. ఈ పోటీతత్వ ధరలు వారికి మరో కొత్త తలనొప్పిగా మారుతున్నాయి.

ఈ మేరకు తమ ఉత్పత్తుల ధరలను ఏ కొంతైనా తగ్గించేందుకు గల సాధ్యాసాధ్యాలను అన్వేషిస్తున్నాయి. మరోవైపు పండుగ సీజన్‌లో సాదరణంగా అన్ని కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటించడం సహజమే. అయితే, ఈసారి సదరు ఆఫర్లును మరింత జోరుగా అందించినట్లయితేనే కొనుగోలుదారులు కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతారనడంలో అతిశయోక్తి లేదేమో.

ఏదేమైనప్పటికీ.. ఈసారి కార్ల కంపెనీలు అందించనున్న డిస్కౌంట్లు / ఆఫర్ల భారం తడిసి మోపెడు కానుంది. కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఫైనాన్సు జోలికి వెళ్లకుండా పూర్తి మొత్తాన్ని చెల్లించి కార్లను కొనుగోలు చేసే వారు లబ్ధి పొండమే కాకుండా.. వడ్డీ రేట్ల బాదను కూడా తప్పించుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, August 27, 2011, 12:51 [IST]
English summary
Honda has created a new confusion among carmakers after drastically reducing the price of the new Jazz hatchback. The previous jazz was priced close to that of the City sedan and buyers preferred to opt for the sedan. the Jazz which was previously not competing with other hatchbacks such as the swift, Polo, Figo and i20 has now emerged as a potent competitor following its price cut.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+