ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న కొత్త స్విఫ్ట్ వీడియో

New Swift
దేశీఅగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ మోడల్ స్విఫ్ట్‌లో అప్‌గ్రేడెడ్ వేరియంట్ విడుదలకు దాదాపు రంగం సిద్ధమైంది. మారుతి కొత్త స్విఫ్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ సెర్చ్‌గా మారింది. ఈ నెల 17న విడుదల కావాల్సి ఉన్న కొత్త అప్‌గ్రేడెడ్ స్విఫ్ట్‌కు సంబంధించిన వీడియోలు (స్విఫ్ట్ టీజర్స్) ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో కూడా మారుతి సుజుకి ఈ వీడియోలను షేర్ చేయడం జరిగింది.

ఆగస్టు 17, 2011వ తేదీన మారుతి సుజుకి అధికారికంగా కొత్త స్విఫ్ట్‌ను దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనుంది. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కంపెనీ దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కొత్త స్విఫ్ట్ టివి ప్రకటనను కూడా కంపెనీ దాదాపు సిద్ధం చేసుకుంది. మీడియా కథనాల ప్రకారం.. ఈ వీడియో షూటింగ్ జరుగుతున్నప్పుడు స్విఫ్ట్ కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారు ముందు అద్దం పగిలినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్లు తెలియరాలేదు.

చూడటానికి పాత స్విఫ్ట్ కన్నా కొత్త స్విఫ్ట్ ఎంతో ఆకర్షనీయంగా కనిపిస్తూనే అసలు రూపాన్ని (బేసిక్ షేప్) కోల్పోకుండా ఉంటుంది. కొత్త స్విఫ్ట్‌లో హెడ్‌లైట్స్ పెద్దవిగా ఉండి, డ్యాష్‌బోర్డ్ కూడా పూర్తిగా మార్చబడింది. సెంటర్ కన్సోల్‌ను కూడా రీడిజైన్ చేయగా, స్టీరింగ్ వీల్‌కు మల్టీ-ఫంక్షనింగ్ బటన్స్‌ను అమర్చబడి ఉండటం కొత్త స్విఫ్ట్‌లో స్వాగతించదగిన మార్పులు. మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మరింత తాజా సమాచారం కోసం వన్ఇండియా ఆటోమొబైల్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, August 8, 2011, 15:49 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki is all set to launch its all new Swift hatchback in India. The official launch of the new Maruti Suzuki Swift is scheduled for 17th August 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+