కొత్త స్విఫ్ట్ .. విడుదలకు ముందే సూపర్ హిట్..

కాగా.. భారత్ మార్కెట్లో ఇలా విడుదలకు ముందే ఒక మోడల్‌కు ఇంత భారీ స్థాయిలో స్పందన రావడం ఇదే మొదటిసారి. గడచిన డిసెంబర్ నెలలో టొయోటా తన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఎతియోస్ లివా మోడల్‌ను ఉత్పత్తి చేయడానికి ముందే 12,000 బుకింగ్‌లు వచ్చాయి. కానీ ఆ సమయానికే టొయోటా తన చిన్న కారును భారత్‌లో ప్రదర్శించి ధర తదితర వివరాలను వెల్లడించింది. అయితే, ప్రస్తుతం కొత్త స్విఫ్ట్ ధరలు మరియ ఫీచర్ల గురించి తెలుసుకోకుండానే కొనుగోలుదారులు అధిక సంఖ్యలో కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై ఆసక్తి చూపుతుండటం విశేషం.
మార్కెట్లోకి రానున్న మూడో-తరం (థర్డ్ జనరేషన్) స్విఫ్ట్ స్టైలిష్ ఇంటీరియర్స్‌తో పాటు కారు బరువు తగ్గించేందుకు మరియు ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా దీని ఫ్యూయెల్ ట్యాంక్‌ను తేలికగా ఉండే దృఢమైన ప్లాస్టిక్‌తో రూపొందించారు. కొత్త స్విఫ్ట్ మార్కెట్లో ఓ కొత్త బెంచ్ మార్క్‌ను సృష్టిస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఏదేమైనప్పటికీ.. కొత్త స్విఫ్ట్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మరో పక్షం రోజుల పాటు ఎదురు చూడక తప్పదు.


Click it and Unblock the Notifications








