కొత్త స్విఫ్ట్ .. విడుదలకు ముందే సూపర్ హిట్..

New Swift
మారుతి సుజుకి అందిస్తున్న కొత్త ప్రిమీయం హ్యాచ్‌బ్యాక్ కారు 'స్విఫ్ట్' విడుదలకు ముందే సూపర్ హిట్ అయ్యింది. ఈ నెల మధ్య భాగంలో విడుదల కానున్న అప్‌గ్రేడెడ్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఇప్పటికే 38,000 బుకింగ్‌లను సొంతం చేసుకొని విశ్లేషకులను విస్మయపరుస్తోంది. మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ ఈ నెల 17 విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో బుకింగ్స్ వస్తుండటంతో కొత్త స్విఫ్ట్ డెలివరీలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా.. భారత్ మార్కెట్లో ఇలా విడుదలకు ముందే ఒక మోడల్‌కు ఇంత భారీ స్థాయిలో స్పందన రావడం ఇదే మొదటిసారి. గడచిన డిసెంబర్ నెలలో టొయోటా తన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఎతియోస్ లివా మోడల్‌ను ఉత్పత్తి చేయడానికి ముందే 12,000 బుకింగ్‌లు వచ్చాయి. కానీ ఆ సమయానికే టొయోటా తన చిన్న కారును భారత్‌లో ప్రదర్శించి ధర తదితర వివరాలను వెల్లడించింది. అయితే, ప్రస్తుతం కొత్త స్విఫ్ట్ ధరలు మరియ ఫీచర్ల గురించి తెలుసుకోకుండానే కొనుగోలుదారులు అధిక సంఖ్యలో కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై ఆసక్తి చూపుతుండటం విశేషం.

మార్కెట్లోకి రానున్న మూడో-తరం (థర్డ్ జనరేషన్) స్విఫ్ట్ స్టైలిష్ ఇంటీరియర్స్‌తో పాటు కారు బరువు తగ్గించేందుకు మరియు ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా దీని ఫ్యూయెల్ ట్యాంక్‌ను తేలికగా ఉండే దృఢమైన ప్లాస్టిక్‌తో రూపొందించారు. కొత్త స్విఫ్ట్ మార్కెట్లో ఓ కొత్త బెంచ్ మార్క్‌ను సృష్టిస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఏదేమైనప్పటికీ.. కొత్త స్విఫ్ట్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మరో పక్షం రోజుల పాటు ఎదురు చూడక తప్పదు.

Most Read Articles

English summary
The launch of the new Maruti Suzuki Swift was confirmed only in the middle of July. With the carmaker opening pre-launch bookings of the new Swift, there has been such a huge response that we fear the new model will have longer waiting period that the current model. According to reports from the Business standard, bookings of the new Swift have crossed 38,000 units.
Story first published: Monday, August 1, 2011, 12:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X