బ్లూమోషన్ టెక్నాలజీ పస్సాట్ కారు రూ. 20.80 లక్షలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో అధునాతన 'బ్లూమోషన్' సాంకేతిక పరిజ్ఞానంతో తయారయిన కొత్త ఎడిషన్ "పస్సాట్" కారును ఈ ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు వోక్స్‌వ్యాగన్ ఇండియా గ్రూప్ సేల్స్ డైరెక్టర్ నీరజ్ గార్గ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. బ్లూమోషన్ టెక్నాలజీలో ఉన్న స్టార్ట్ స్టాప్, బ్రేక్ ఎనర్జీ రెక్యుపరేషన్, డిఎస్‌జి డ్యూయెల్ క్లచ్ గేర్ బాక్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అత్యంత ఇంధన సామర్థ్యం గల ఇంజన్ వంటి అధునాతన ఫీచర్లతో వోక్స్‌వ్యగాన్ పస్సాట్ కారు లభ్యమవుతుందని, ఆటోమొబైల్ పరిశ్రమలో తమ బ్లూమోషన్ టెక్నాలజీ ఓ కొత్త వరవడిని సృష్టించగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది.


Click it and Unblock the Notifications