కొత్త ఎస్‌యూవీ 4008ని ఆవిష్కరించిన ప్యూజో

పెట్రోల్ వేరియంట్ ప్యూజో 4008 ఎస్‌యూవీ 1.6 లీటర్, 2.0 లీటర్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ 114 బిహెచ్‌పిల శక్తిని, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 148 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తాయి.
అలాగే, 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ 110 బిహెచ్‌పిల శక్తిని, 1.8 లీటర్ డీజిల్ ఇంజన్ 148 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తాయి.
అన్ని వేరియంట్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో లభ్యం కానున్నాయి. యూరప్ మార్కెట్ కోసం తయారు చేస్తున్న ప్యూజో 4008 ఎస్‌యూవీలో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉండనుంది. ఇందులో విశాలమైన, ఆకర్షనీమైన ఇంటీరియర్స్, సరికొత్త ఫ్రంట్ గ్రిల్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉండగా, గడచిన కొన్ని సంవత్సరాల క్రితం భారత్‌ను విడిచి వెళ్లిన ప్యూజో తిరిగి దేశీయ విపణిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2010లో ప్యూజో 508 సెడాన్‌ను విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని ప్యూజో భావిస్తోంది.
మరోవైపు ప్యూజో చిన్న కారు ప్యూజో 207 హ్యాచ్‌బ్యాక్‌ను కూడా కంపెనీ భారత మార్కెట్‌కు పరిచయం చేసే ఆస్కారం ఉంది. ప్రస్తుం కంపెనీ ఈ కారును భారత రోడ్లపై పరీక్షిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో గుజరాత్‌లోని సనంద్‌లో తమ ప్లాంటు నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు కంపెనీ ఉన్నతాధి ఒకరు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








