భారత రోడ్లపై పరుగులు తీయనున్న ప్యూజో కార్స్

Peugeot
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ "ప్యూజో" (Peugeot) తమ కొత్త కార్లతో భారత మార్కెట్లోకి అడుగు పెట్టాలని సన్నాహాలు చేస్తుంది. కంపెనీ అందిస్తున్న సెడాన్ మోడల్ వేరియంట్ కారు 508 మరియు బహుళ ప్రయోజనాల వాహనం (ఎమ్‌పివి) మోడల్ కారు 3008లను త్వరలోనే దేశీయ వినియోగదారులకు పరిచేయం చేయనుంది. డి-సెగ్మెంట్ విభాగంలో ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా అకార్డ్, స్కొడా సూపర్బ్ వంటి మోడళ్లకు ధీటుగా ఇది నిలువనుంది. తాజాగా 508 సెడాన్‌ కారును ప్యూజో కంపెనీ చైనా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ప్యూజో 508 సెడాన్ రెండు ఇంధన ఆప్షన్లలో లభిస్తుంది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ 156 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తే.. 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్ 140 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. వినియోగదారుల ఇష్టాన్ని బట్టి ఇందులో మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేరు మార్పిడి వ్యవస్థ)ను ఎన్నుకోవచ్చు. ఈ కారులో ఆరు గేర్లు ఉంటాయి. కాగా.. ప్యూజో కంపెనీ భారత్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలా.. లేదా తమిళనాడులో ఏర్పాటు చేయాలా అనే అంశంపై కంపెనీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 12, 2011, 17:06 [IST]
English summary
Peugeot, the French carmaker will mark its arrival in India by launching its 508 sedan and the 3008 MPV. The new 508 which will hit Indian markets shortly this year has been unveiled by the carmaker in China. The 508 enters the D-segment of cars dominated by the Honda Accord as well as the Skoda Superb.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+