కొత్త స్విఫ్ట్‌కు లక్షకు పైగా బుకింగ్స్.. మరి డెలివరీలు..?

కొత్త స్విఫ్ట్ కారుకు ఇప్పటి వరకూ సుమారు 1.08 యూనిట్ల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని డెలివరీలను వేగవంతం చేస్తామని కంపెనీ పేర్కొంది. స్విఫ్ట్‌కు డిమాండ్ అధికంగా ఉందని, ఈ నెల తొలిభాగంలో సరఫరా వైపు కాస్తంత ఇబ్బందులు ఉన్నాయని, అయితే నెమ్మదిగా సాధారణ స్థాయికి వస్తుందని మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ తెలిపారు.
ప్రస్తుతం రోజుకు 700 కార్లను ఉత్పత్తి చేస్తున్నామని, త్వరలోనే నెలకు 17,000 నుండి 18,000 స్విఫ్ట్ కార్లను విక్రయ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన తెలిపారు. పాత స్విఫ్ట్‌ను ప్రతి నెలా 12,000 కార్లు మాత్రమే విక్రయించేవారు. ఈ ఏడాది ఆగస్టు 17 మార్కెట్లోకి విడుదలైన కొత్త స్విఫ్ట్ కోసం ఇప్పటి వరకూ 1.08 లక్షల బుకింగ్‌లు వచ్చాయని, ప్రస్తుతం డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్ ఆరు నెలలు గానూ, పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్ ఐదు నెలలు గానూ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








