కొత్త టాటా సుమో గోల్డ్ ఎమ్‌యూవీ వేరియంట్లు, ధరలు

Tata Sumo Gold
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ లిమిటెడ్ ఓ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ టాటా సుమోను భారత మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. "టాటా సుమో గోల్డ్" అనే పేరుతో పిలువబడే ఈ ఎమ్‌యూవీ (మల్టీ యుటిలిటీ వెహికల్) పాత వెర్షన్ సుమో కన్నా ఎంతో మెరుగైనది. వివిధ వేరియంట్లలో లభించే టాటా సుమో గోల్డ్ ఎమ్‌యూవీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

టాటా సుమో గోల్డ్ టిసిఐసి వేరియంట్లు ధరలు:
* టాటా సుమో గోల్డ్ టిసిఐసి సిఎక్స్ - రూ.5.23 లక్షలు
* టాటా సుమో గోల్డ్ టిసిఐసి ఎల్ఎక్స్ - రూ.5.60 లక్షలు
* టాటా సుమో గోల్డ్ టిసిఐసి ఈఎక్స్ - రూ.5.96 లక్షలు
* టాటా సుమో గోల్డ్ టిసిఐసి జిఎక్స్ - రూ.6.60 లక్షలు

టాటా సుమో గోల్డ్ సిఆర్‌డి వేరియంట్ల ధరలు:
* టాటా సుమో గోల్డ్ సిఆర్4 సిఎక్స్ - రూ.5.49 లక్షలు
* టాటా సుమో గోల్డ్ సిఆర్4 ఎల్ఎక్స్ - రూ.5.84 లక్షలు
* టాటా సుమో గోల్డ్ సిఆర్4 ఈఎక్స్ - రూ.6.10 లక్షలు
* టాటా సుమో గోల్డ్ సిఆర్4 జిఎక్స్ - రూ.6.74 లక్షలు

ఎంట్రీ లెవల్ ఎమ్‌యూవీ/ఎస్‌యూవీ సెగ్మెంట్లో వస్తున్న ఈ కొత్త టాటా సుమో గోల్డ్, ఇదే సెగ్మెంట్లో ఉన్న కొత్త మహీంద్రా బొలెరో అలాగే, త్వరలో మార్కెట్లోకి రానున్న చెవర్లే తవేరా బిఎస్4 మోడళ్లకు గట్టి పోటీగా నిలువనుంది

టాటా సుమో గోల్డ్ ఎమ్‌యూవీలో 3-లీటర్ సిఆర్4 డీజిల్ ఇంజన్‌ బిఎస్4 కాలుష్య పరిమితులకు లోబడి ఉంటుంది. ఈ ఇంజన్ 3000 ఆర్‌పిఎమ్ వద్ద 80 బిహెచ్‌పిల శక్తిని, 1000-2000 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఈ కొత్త టాటా సుమో గోల్డ్ ఎమ్‌యూవీ ప్రతి లీటరుకు 14.07 కి.మీ. మైలేజీనిస్తుంది.

అలాగే, 3.0 లీటర్ టిసిఐసి ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తున్న టాటా సుమో గోల్డ్ బిఎస్ (భారత్ స్టేజ్) -3 కాలుష్య పరిమితులకు లోబడి ఉంటుంది. ఇది 70 బిహెచ్‌పిల శక్తిని, 223 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. టాటా సుమో గోల్డ్ ఎమ్‌యూవీ 36 నెలలు లేదా 1,00,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 12, 2011, 15:28 [IST]
English summary
The Tata Sumo's Achilles Heel has been its ride comfort on rough Indian roads. Tata Motors has said the new Sumo Gold now gets improved suspension to make the ride more smooth and comfortable. This is an important improvement considering the Sumo is usually driven in rural areas and as a Taxi across the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+