మెట్రో నగరాల్లో మారుతి షోరూమ్స్: స్థలాల కోసం అన్వేషణ

మెట్రో నగరాల్లో ప్రధాన స్థలాలను కొనుగోలు చేసేందుకు మారుతి రూ 50-60 కోట్ల మేర పెట్టుబడులను వెచ్చించనుంది. ఇందులో భాగంగా ముంబై నగరంలోని అంధేరి ప్రాంతం, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ప్రాంతాలలో స్థాలాలను కొనుగోలు చేయడానికి మారుతి ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రాంతాలు షాపింగ్ మాల్స్, కార్ షోరూమ్‌లతో రద్దీగా ఉండే మార్కెట్ పరిసరాలు కావడంతో ఈ ప్రదేశాలలో కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని కంపెనీ భావిస్తుంది.
ఈ విస్తరణలో భాగంగా మెట్రో నగరాల్లో మారుతి ఇప్పటికే 12 ప్రాంతాలను గుర్తించింది. వాటిల్లో ఐదు స్వంత మారుతి అవుట్‌లెట్లు ఉన్నాయి. కాగా..మారుతి కొత్తగా ఏర్పాటు చేయబోయే అవుట్‌లెట్లలో ఆట వస్తువులు, బ్యాగేజ్‌లు, కార్లకు సంబంధించిన పరికరాలు, అలంకరణ వస్తువులు వంటి మారుతి బ్రాండెడ్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు లభ్యం కానున్నాయి.
మారుతి త్వరలో విడుదల చేయబోయే బహుళ ప్రయోజనాల వాహనం (ఎమ్‌యూవీ) కిజాషి విక్రయాలకు ఈ విస్తరణ ప్రణాళిక మరింత ఊతమివ్వవచ్చునని కంపెనీ భావిస్తుంది. కిజాషి ధర రూ. 14-16 లక్షలుగా ఉండి హోండా సివిక్, టొయోటా కరోలా, స్కోడా లారా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. కార్ మార్కెట్లో ఎమ్‌యూవీ (బహుళ ప్రయోజనాల వాహనం) 18 శాతం వాటా కలిగి ఉంది. ఈ ఏడాది "ఆర్ 3" కారు విడుదలతో మారుతి కూడా ఎమ్‌యూవీ విభాగంలో అడుగుపెట్టనుంది.


Click it and Unblock the Notifications








