ఆగస్టు 17న భారత్‌కు రానున్న ఫోక్స్‌వ్యాగన్ జెట్టా

సరికొత్త లుక్, పొడవైన టెయిల్ ల్యాంప్స్, ఎల్-ఆకారంలో ఉండే స్పాట్‌లైట్స్ వంటి ఎన్నో ఆకర్షనీయమైన ఫీచర్లు ఈ కారు సొంతం. జెట్టా కారు ముందు భాగం ఫోక్స్‌వ్యాగన్ ఇతర మోడళ్ల మాదిరిగానే ఉంటూనే వెనుక భాగం మాత్రం ఆడి ఏ4 సెలూన్ కారును తలపిస్తుంది. 2-లీటర్ కామన్ రైల్ డీజిల్ మోటార్‌తో లభించే జెట్టా 140 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.
అంతేకాకుండా ఇది 1.4 లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ మోటార్, 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించవచ్చని అంచనా. అయితే ప్రస్తుతం భారత మార్కెట్ డిమాండ్ ఎక్కువగా డీజిల్ కార్లపైనే ఉండటంతో ఫోక్స్‌వ్యాగన్ తొలుత డీజిల్ వేరియంట్‌ను ఆ తర్వాత పెట్రోల్ వేరియంటన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. కరోలా ఆల్టిస్, స్కొడా లారా, చెవర్లే క్రూజ్, రీనాల్ట్ ఫ్లూయెన్స్ సెడాన్ వేరియంట్ కార్లు ఫోక్స్‌వ్యాగన్ జెట్టాకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.


Click it and Unblock the Notifications








