పదిరోజుల్లో 8,000 బుకింగ్‌లు...

కేవలం పదిరోజుల్లో 8,000 బుకింగ్‌లు వచ్చాయని, ఇటీవల కాలంలో కారును ప్రారంభించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం ఇదే మొదటిసారని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఎస్‌యూవీ రూ.10.8 లక్షల నుంచి రూ.11.95 లక్షలు (ఎక్స్‌షో రూం ఢిల్లీ) కాగా ఈ కారును సెప్టెంబర్ 29న మార్కెట్లో విడుదల చేశారు. అక్టోబర్ 1 నుంచి బుకింగ్‌లు ప్రారంభించారు. ఈ బుకింగ్‌లు పూర్తయ్యే వరకు కొత్త నగరాల్లో బుకింగ్‌లు ప్రారంభించవద్దని కంపెనీ నిర్ణయించింది. ఈ కారును చెనై్నకి చెందిన రీసెర్చి టీం డీజైన్ చేసింది. భారత్‌తోపాటు దక్షిణాఫ్రికాలో కూడా ఈ కారును ప్రారంభించారు.
అయితే, ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా రూపొందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ "మహీంద్రా ఎక్స్‌యూవీ 500"కు చెక్ పెట్టేందుకు అనుకున్న దానికంటే ముందుగానే టాటా మోటార్స్ ప్రీమియం ఎస్‌యూవీ టాటా సఫారీని విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. హోండా సిఆర్-వీ, టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలకు ధీటుగా టాటా సఫారీ మెర్లిన్ నిలువనుంది.


Click it and Unblock the Notifications








