ఎనిమిది శాతం గ్లోబల్ మార్కెట్ వాటాపై కన్నేసిన నిస్సాన్

Nissan
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్స్ ప్రపంచ మార్కెట్ వాటాపై కన్నేసింది. 2017వ సంవత్సరం నాటికి ఎనిమిది శాతం మార్కెట్ వాటాను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జపాన్‌లోని యోకోహమా ప్లాంటులో నిస్సాన్ సీఈఓ కార్లోస్ ఘోస్ తన మధ్యంత వాణిజ్య ప్రణాళికను ప్రకటిస్తూ.. తమ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లను ఎనిమిది శాతానికి పెంచుకోనున్నట్లు తెలిపారు.

నిస్సాన్ మోటార్స్ వాణిజ్య ప్రణాళికలో.. సంస్థ విక్రయాలను పెంచుకునేందుకు రానున్న ఆరు సంవత్సరాల పాటు ప్రతి ఆరు వారాలకు ఒక కొత్త మోడల్ చొప్పున విడుదల చేయనున్నట్లు సూచించింది. అయితే ఇది నిస్సాన్ ఆర్ అండ్ డి డివిజన్లపై తీవ్ర ఒత్తిడిని తెస్తుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. నిస్సాన్ వాణిజ్య ప్రణాళికపై విశ్లేషకులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం భారత్‌లో నిస్సాన్ తమ చిన్న కారు మైక్రాను మాత్రమే అందిస్తుంది. భవిష్యత్తుల్లో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 29, 2011, 13:11 [IST]
English summary
Japanese carmaker Nissan Motors has set itself a target of a global market share of eight per cent by 2017. Nissan's CEO Carlos Ghosn in his mid term business plan, announced in Yokohama, Japan, has also said the carmaker had to increase profit margins to eight percent. Nissan Motors is the only Japanese carmaker to have predicted to sell more cars this year than the previous year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+